నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ’35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. ఈ సినిమా ఈనెల 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ నివేత థామస్ మీడియాతో మాట్లాడుతూ, ‘ఇదొక సింపుల్ అండ్ బ్యూటీఫుల్ స్టొరీ. ఇందులో నివేత థామస్ కాకుండా తల్లిగా నటించిన సరస్వతి పాత్రే కిిస్తుంది. డైరెక్టర్ నంద కిషోర్ కథని అద్భుతంగా రాశారు. ఇందులో తిరుపతి తిరుమల వెంకన్న స్వామి కూడా కథలో ఒక క్యారెక్టర్. కథ ఇంత రీజినల్‌గా, రూటెడ్‌గా ఉండటం నాకు చాలా నచ్చింది. డివైన్ ఫీలింగ్ అన్ని సీన్స్‌లో ఉంటుంది. ఇన్నోసెంట్ ఫ్యామిలీ స్టొరీ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతుంది. ఇందులో మ్యాథ్స్ అనేది చిన్న పార్ట్ మాత్రమే. భార్య, భర్త, పిల్లలు, టీచర్ స్టూడెంట్స్ ఇలాంటి బ్యూటీఫుల్ రిలేషన్షిప్స్ గురించి చాలా అందంగా చెప్పాం. ఇది కె.విశ్వనాథ్ సినిమాలు చూసిన ఫీలింగ్ ఇస్తుంది. ఇందులో మ్యాథ్స్ టీచర్ చాణక్యగా ప్రియదర్శి నటించారు. గౌెతమి, భాగ్యరాజ్‌తో నటించటం ఆనందంగా ఉంది. రానాకి ఈ కథ ముందునుంచి తెలుసు. సురేష్ ప్రొడక్షన్‌తో ఆయన ఈ సినిమాని ప్రజెంట్ చేసినందుకు కృతజ్ఞతలు. అందర్నీ కనెక్ట్ చేసే కథతో రాబోతున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది’ అని చెప్పారు.