అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ

A story that connects everyoneబిఎస్‌కె మెయిన్‌ స్ట్రీమ్‌ పతాకంపై బండి సరోజ్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్‌ సేనాపతి, నిఖిల్‌ గోపు, అనిల్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్‌ నుంచి యు/ఎ సర్టిఫికెట్‌ పొంది, ఈ నెల 22న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ట్రైలర్‌ రిలీజ్‌ లాంచ్‌ వేడుకలో హీరో సందీప్‌ కిషన్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సరోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘ప్రతి కామన్‌ మ్యాన్‌కు కనెక్ట్‌ అయ్యే సినిమా. పోస్టర్‌లో మీకు సత్తి బాబు, లోవరాజు అనే రెండు క్యారెక్టర్స్‌ కనిపిస్తున్నాయి. ్రతి ఒక్కరిలో సత్తి బాబు ఉంటాడు, లోవరాజు ఉంటాడు. సత్తిబాబు నుంచి లోవరాజుకు జరిగే ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఈ సినిమా. మిమ్మల్ని మీరు తెరపై చూసుకున్నట్లు ఈ సినిమా ఉంటుంది. నేను అభిమానించే చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమాని రిలీజ్‌ చేయటం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.