తల్లిదండ్రుల్ని గుర్తు చేసే కథ

తల్లిదండ్రుల్ని గుర్తు చేసే కథప్రణవ్‌ ప్రీతమ్‌, షాజ్ఞ శ్రీ వేణున్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పుంగనూరు-500143’. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొం దించారు డైరెక్టర్‌ శ్రీనాథ్‌ పులకురం. బ్లాక్‌ ఆంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్‌ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఇంటర్మీడియట్‌ టీనేజ్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్‌ నుంచి యూ/ఏ సర్టిఫికేట్‌ అందుకున్న ఈ సినిమా ఈ నెల 21న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించారు. దర్శకుడు శ్రీనాథ్‌ పులకురం మాట్లాడుతూ, ‘ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. యువత, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఈ సినిమా చూశాక మీరు మీ పేరెంట్స్‌ను గుర్తు చేసుకుంటారు’ అని తెలిపారు. ‘శ్రీనాథ్‌కి సినిమా మీద ప్యాషన్‌ అర్థమైంది. ఆయన మాలాంటి చిన్న ప్రొడ్యూసర్‌ దగ్గర సినిమా చేయాల్సిన దర్శకుడు కాదు. చాలా పెద్ద సినిమాలు చేయాల్సినంత ప్రతిభ, కమిట్‌ మెంట్‌, ఉన్నాయి. మేము ఇచ్చిన లిమిటెడ్‌ బడ్జెట్‌లో ఈ సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించాడు. ఈ సినిమా నిర్మాణంలో నాకు సపోర్ట్‌ చేసి ఆర్థికంగా సహాయం చేసిన మిత్రులకు, మా కుటుంబ సభ్యులకు థ్యాంక్స్‌ చెబుతున్నా. మా సినిమా చూసి ప్రేక్షకులు బాగా ఆదరిస్తాని ఆశిస్తున్నాం’ అని నిర్మాత భువన్‌ రెడ్డి కొవ్వూరి చెప్పారు.