మండలంలో పెద్దతూండ్ల గ్రామపరిదిలోని గాదంపల్లిలో వింత మేకపిల్ల జన్మించింది. మేకపిల్ల యజమాని బియ్యన్ని పోచమల్లు పూర్తి కథనం ప్రకారం తనకు చెందిన మేకల,గొర్రెల మందలో ఓ మేక శుక్రవారం మేకపిల్లకు జన్మనివ్వగా ఆ మేకపిల్ల 8 కాళ్ళతో వింతగా జన్మించినట్లుగా తెలిపాడు. ఈ వింత మేకపిల్లకు చూడడానికి గ్రామస్తులు క్యూ కట్టారు. జన్యుపరమైన లోపాలతో ఈలాంటి మేకపిల్లలు పుట్టవచ్చునని మండల పశువైద్యాధికారి గోనె జగపతిరావు తెలిపారు.