జీవో నేo.60 ప్రకారం వేతనాలు చెల్లించకుంటే సమ్మె తప్పదు..

If wages are not paid according to Jeeves No. 60, there will be a strike.– ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం మరియు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతం వెంటనే చెల్లించాలని తేది 29.7.2024 సోమవారం నుండి పనులు నిలుపుదల చేసి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. సోమవారం రోజున తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న 3నెలల వేతనం చెల్లించాలని  కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ కి, హాస్పిటల్ సూపరింటెండెంట్ చిన్న నాయక్ కి తేది 29.7.2024 నుండి చేస్తున్న నిరవధిక సమ్మె నోటీస్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2022 జూన్ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన కొత్త వేతనాలను ఆసుపత్రి కార్మికులు అందుకుంటున్నారని కానీ భువనగిరి జిల్లా  ఆసుపత్రిలో మాత్రం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం నిర్వాహణలో ఉన్న టీ. వి టీ ఏజెన్సీ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిబంధనలను తుంగల తొక్కి కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలలో పారదర్శకత లేకుండా కేవలం రూ.10,000 మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంటున్నాడని ఆయన అన్నారు. పి ఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు చేసి  ఇవ్వని వారికి వెంటనే ఇవ్వాలని, 8 గంటల పనిన విధానాన్ని అమలు చేసి 3 షిఫ్ట్ లు వెంటనే అమలు చేయాలని, సంవత్సర కాలంగా తక్కువ ఇచ్చిన వేతనం వెంటనే చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లని పరిష్కరించని యెడల తేదీ 27.2. 2024 నాటి నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, శానిటేషన్ కార్మికులు రాచకొండ పుష్ప, జేరిపోతుల కమలమ్మ, ఇస్తారమ్మ, సులోచన, కృష్ణవేణి, లలిత, భారతమ్మ,  హేమలత, మహేందర్, విజయలక్ష్మి, రేణుక, ఉమారాణి, అండాలు పాల్గొన్నారు.