గీతం యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య

నవ తెలంగాణ – పటాన్ చెరు
రుద్రారం గీతం యూనివర్సిటీ విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు పటాన్ చెరు సీఐ తెలిపిన వివరాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన నాగల్లి వర్ష (19) గీతం యూనివర్సిటీ బాలికల హాస్టల్ లో ఉంటూ బీటెక్ (సీఎస్ ఈ) ద్వితీయ సంవత్సరం చదువుతుంది.కాగ శుక్రవారం ఉదయం 8 గంటలకే కాలేజీకి వచ్చిన వర్ష 10 గంటల సమయంలో తిరిగి హాస్టల్ కు చేరుకుంది. అనంతరం మరో సారి యూనివర్సిటీకి వెళ్లి మళ్లీ హాస్టల్ కి చేరుకుని తన గదిలో ఫ్యానుకు బెడ్ షీట్ తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ కి వచ్చిన తన రూమ్ మెంట్ జరిగిన సంఘటనను చూసి భయపడి యూనివర్సిటీ యజమాన్యానికి విషయం చెప్పడంతో వారు పటాన్ చెరు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి సంఘటనా స్థలంలో పూర్తి వివరాలు సేకరించి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా వర్ష మొదటినుంచి స్నేహితులతో కలుపుగోలుగా ఉండేది కాదని ఆమె స్నేహితులు తెలిపారు.