సాప్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు గురుకుల పాఠశాల విద్యార్థిని

నవతెలంగాణ- డిచ్ పల్లి
ఈనెల 29 నుండి సెప్టెంబర్ 02 వరకు పింగ్టన్ సిటీ, ఫిజియన్ ప్రొవైన్స్ చైనా దేశంలో జరగనున్న జూనియర్ (అండర్-18) ఏషియన్ మహిళల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి లోని సాంఘిక సంక్షేమ కళాశాల క్రీడాకారిని లకావత్ రాణి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ గోదావరి ఆదివారం తెలిపారు.ఈ సందర్భంగా క్రీడాకారిణి ఎల్ రాణిని ఉద్దేశించి ప్రిన్సిపాల్ గోదావరి మాట్లాడుతూఐదవ తరగతి నుండి శిక్షణ పొంది ఇప్పటివరకు 22 సార్లు జాతీయ పోటీలలోహొ పాల్గొని పలుమార్లు ఉత్తమ క్రీడాకారిణిగా ప్రత్యేక బహుమతులు అందుకోవడం అభినందన మన్నారు. సుద్దపల్లి కళాశాలలో కొనసాగుతున్న సాఫ్ట్ బాల్ రాష్ట్ర అకాడమీలో ప్రత్యేక శిక్షణ పొందుతుందని వివరించారు.భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ క్రీడాకారిని భవిష్యత్తులో ఒలంపిక్స్ క్రీడలు పాల్గొనేలా శిక్షణను ఇస్తూ ప్రోత్సహిస్తామన్నారు.సాఫ్ట్బాల్ అకాడమీ సుద్దపల్లిలో ఏర్పాటు చేసినందుకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి నికులాస్, స్పోర్ట్స్ అధికారి రామ లక్ష్మయ్య, నోడల్ ఆఫీసర్ శేషు కుమార్, ఆర్ సి ఓ మేరీ ఏసు పాదం, జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇందుకు ఒక కృషిచేసిన పాఠశాల పిడి లత, సాఫ్ట్బాల్ కోచ్ వేముల మౌనికను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్ పాల్గొని మాట్లాడుతూ సాఫ్ట్ బాల్ క్రీడా రాష్ట్ర జాతీయ గుర్తింపు పొందిన క్రీడ సాఫ్ట్ బాల్క్రీడలో పాల్గొన్న క్రీడాకారులకు స్పోర్ట్స్హొ ఉన్నత విద్య, ఉద్యోగాలలో‌హొ రిజర్వేషన్ వర్తిస్తుందని పేర్కొన్నారు.హొఈనెల 10 నుండి 16 వరకు చీమన్ బాగ్ స్టేడియం ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగే శిక్షణహొ శిబిరంలో ఎల్ రాణి పాల్గొననున్నదని తెలిపారు.జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎల్ రాణి డ ఏ ఇందు ఎంపికకవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మహాలక్ష్మి,వ్యాయమ ఉపాధ్యాయురాలు నల్లూరి లత, మమత మరియు రాష్ట్ర సాఫ్ట్ బాల్ బాలికల అకాడమీ కోచ్ వేముల మౌనిక పాల్గొన్నారు.