నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్షిప్‌కి ఎంపికైన విద్యార్థి

నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని యర్రగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కాకిరాల చరణ్‌ రాష్ట్ర స్థాయిలో నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్షిప్‌కు ఎంపికయ్యాడు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల నుండి ఒకే ఒక్క విద్యార్థి ఎంపిక కావడంతో ఆ పాఠశాల హెడ్మాస్టర్‌ ఉండేటి ఆనంద్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపికైన చరణ్‌కి అభినందనలు తెలియజేశారు. రానున్న కాలంలో మరింత మంది విద్యార్థులు మెరిట్‌ స్కాలర్షిప్‌కి ఎంపికఅయ్యే విధంగా శిక్షణ ఇస్తామని అన్నారు. మెరిట్‌ స్కాలర్షిప్‌కి ఎంపిక అయిన విద్యార్థికి పాఠశాల ఉపాధ్యాయులు శంకర్‌ మహదేవన్‌, సునందరెడ్డి, శాంతకుమారి, రాజ్యలక్ష్మి, సరిత, బాబురావు, వెంకటేశ్వరరావు, బాలు, సుజాత, శిరీష, మీరాసాహెబ్‌, తదితరులు అభినందనలు తెలియజేశారు.