నవతెలంగాణ – రెంజల్
ఇటీవల నిర్వహించిన జాతీయ మిల్స్ కం మెరిట్ స్కాలర్షిప్ నందు ఎంపికైన సిహెచ్ శివకుమార్ 9వ తరగతి విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలరాం అభినందించారు. ఈ స్కాలర్షిప్ ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థికి 12 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు 48 వేల రూపాయలు తన బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ పరీక్షను ఎనిమిదవ తరగతి విద్యార్థులు నేషనల్ వైడ్ గా రాస్తారని ఆయన తెలిపారు. జాతీయస్థాయి విషయాలను తమ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరీక్షలను రాసేలా వారికి అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బలరాం, ఉపాధ్యాయులు సురేష్, సంతోష్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.