కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి

నవతెలంగాణ – మోర్తాడ్

మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినోద్ తెలిపారు. ఈనెల 2 3 4 తేదీలలో విశాఖపట్నంలో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏడవ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ పోటీలలో వివిధ రాష్ట్రాల నుండి 3000 మంది విద్యార్థులు పాల్గొనగా మన పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని ప్రణతి అండర్ 12 ఇయర్స్ ఏజ్ కేటగిరిలో కటాస్ మరియు స్పేరింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. మరియు అండర్ 14 ఇయర్స్ కేటగిరీలో అంజలి కసాయ పథకం సాధించి నట్లు తెలిపారు. గోల్డ్ మెడల్ కాసేపధకం సాధించిన విద్యార్థినిలకు పాఠశాల అధ్యాపక బృందం సోమవారం అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న క్రీడలలో ప్రతిభ కనబరిచి గ్రామాన్ని పాఠశాల పేరును నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం ఉన్నారు.