
నవతెలంగాణ – కంఠేశ్వర్
కాకతీయ విద్యాసంస్థల నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి నిండు ప్రాణం బలి తీసుకున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విగ్నేష్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జాస్విత్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకొని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు వచ్చారు. అక్కడ విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాల అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి విగ్నేష్ మాట్లాడుతూ.. కాకతీయ విద్య సంస్థలో 9 వ తరగతి చదువుతున్న జాస్విత్ రెడ్డి అనే అబ్బాయి అనుమానాస్పదంగా మరణించడం జరిగిందన్నారు. కూత వేటు లో మల్టి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నా కాకతీయ యాజమాన్యం సమయానికి స్పందించకుండా నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థి మృతి కి ప్రధానకారణం అని అన్నారు . విద్యార్థి మరణానికి కారణం ఐన కాకతీయ విద్య సంస్ధల పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.