ఈ నెల 23న ‘డీమాంటీ కాలనీ 2’ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పంపిణీ చేస్తోంది. ఈ సినిమాను శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించారు. దర్శకుడు అజరు ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అజరు భూపతి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తదితరులు అతిథులుగా పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. నిర్మాత బి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ, ‘తమిళంలో ఈ సినిమా బిగ్ హిట్ అయ్యింది. తెలుగులోనూ అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’ అని తెలిపారు. ‘ఈ సినిమాను తమిళంలో నేనే ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేశాను. తమిళం కంటే తెలుగు ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ మూవీకి 3, 4 పార్ట్స్ కూడా చేయబోతున్నాం’ అని డైరెక్టర్ అజరు ఆర్ జ్ఞానముత్తు చెప్పారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ‘నిర్మాత సురేష్ రెడ్డి మంచి మూవీస్ తీసుకుంటాడనే నమ్మకం ఉంది. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని తెలిపారు.