హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 31న దీపావళి సందర్భంగా తెలుగులో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో శనివరాం ఈ సినిమా ట్రైలర్‌ను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ మాట్లాడుతూ, ‘ట్రైలర్ మీ అందరికీ బాగా నచ్చిందని భావిస్తున్నా. ఈ సినిమా కథను బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ కోసం రాసుకున్నాం. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో కథను కొత్తగా ప్రెజెంట్ చేశాం. 1970, 80 కాలాన్ని ప్రతిబింబించేలా, కష్ణగిరి అనే ఊరు యూనిక్‌గా ఉండేలా, మధ్యాహ్నం చీకటి పడే ఎలిమెంట్ తీసుకున్నాం. సినిమా ప్రారంభం నుంచే ‘క’ ప్రపంచానికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’ అని అన్నారు. ”ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. దీపావళికి మా చిత్రానికి కాసుల వర్షం కురవాలని కోరుకుంటున్నా’ అని డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి చెప్పారు. కో ప్రొడ్యూసర్ చింతా వినీషా రెడ్డి మాట్లాడుతూ, ‘ఒక మంచి మూవీ చేయాలనే ప్రయత్నంలో చాలా ఎఫర్ట్స్ పెట్టి పనిచేశాం. సినిమా అవుట్‌పుట్ మేమంతా సంతప్తిపడేలా వచ్చింది’ అని తెలిపారు.
ఈ నెల 31న కేవలం తెలుగులో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఒకవారం తర్వాత కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేస్తాం. ఈ కథ విన్నప్పుడు ఇలాంటి ఒక మంచి కథ ప్రేక్షకులకు చూపించాలి అనిపించింది. క్లైమాక్స్ 20 నిమిషాలు హైలైట్ అవవ్వడమే కాదు సర్‌ప్రైజ్ చేస్తాయి. ఇదొక థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వెళ్తుంటుంది. ఈ సినిమాలో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తా.
– హీరో కిరణ్ అబ్బవరం