దీపావళికి అదిరిపోయే సర్‌ప్రైజ్‌..

దీపావళికి అదిరిపోయే సర్‌ప్రైజ్‌..రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత రామ్‌ చరణ్‌ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి దీటుగా సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్‌. దీపావళి సందర్భంగా ‘గేమ్‌ చేంజర్‌’ నుంచి తొలి సాంగ్‌గా ‘జరగండి..’ అనే పాటను విడుదల చేస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్స్‌ ప్రైజ్‌కి దక్కించుకుంది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎదురు చూస్తున్న అభిమానులు, ఆడియెన్స్‌కి ఈ పాట మంచి కిక్‌ ఇచ్చేలా ఉంటుందంటున్నారు మేకర్స్‌.
డైరెక్టర్‌ శంకర్‌ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలను మించేలా ‘గేమ్‌ ఛేంజర్‌’ను ఆయన రూపొందిస్తున్నారు. పవరఫుల్‌ రోల్‌లో చరణ్‌ను ఆయన ప్రెజెంట్‌ చేస్తున్నారు.