– మెనూ ప్రకారం భోజనం అందించాలి.
– ఎంపిపి పాల్త్య విఠల్
నవతెలంగాణ నసురుల్లాబాద్
విద్యార్థుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వ గురుకులల్లో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని నసురుల్లాబాద్ ఎంపిపి పాల్త్య విఠల్ సూచించారు. శనివారం నసురుల్లాబాదు మండల కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను ఎంపీపీ ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాలలోని రికార్డులను పాఠశాల గదులను వంటశాల ఆయన పరిశీలించారు. వంట సామగ్రి, కూరగాయల బియ్యంలను పరిశీలించారు. రాత్రి కరెంటు పోతే గురుకుల పాఠశాల అందాకారంలో ఉంటుందని కరెంటు వచ్చేవరకు ఏలాంటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులంతా భయంతో ఉంటున్నామని ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలను నెరవేర్చే లాగా పని చేయాలన్నారు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించి 100శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, గురుకులంలోని మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఇచ్చిన నినాదం మేరకు పాఠశాలలోని ఆవరణను పచ్చదనంతో ఉంచాలని సూచించారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే విషయంలోనూ, వారికి అందించే వసతుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేంది లేదన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పేర్కా శ్రీనివాస్, ఎంపీడీవో కళావతి ఎంపీఓ రాము, ప్రతాప్ సింగ్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.