మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు తెలంగాణ మోడల్ స్కూళ్ల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినట్లు మండల ప్రత్యేక అధికారి అయినా ఉద్వాన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి జీనుగు మరియాన్న తెలిపాడు బుధవారం తెలంగాణ మోడల్ మరియు కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయం స్కూల్స్ అండ్ వసతి గృహాల ను జిల్లా కలెక్టర్ అద్వైద్ కుమార్ సింగ్ ఆదేశాలు మేరకు బుధవారం పలు వసతులు, వంటశాల, భోజన శాల, టాయిలెట్స్, పరిసరాలను పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షా కాలంలో తీసుకోవలసిన పలు జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, సరైన చదువులు, ఆరోగ్య వాతావరణ పరిస్థితుల నిర్వహణ గురుంచి తగు జాగ్రత్తలు శ్రద్దాశక్తులు తో తీసుకోవాలి అని కేజీబీవీ మరియు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ ఇల్లందులో సుమలత, డాక్టర్ కే శ్రీనివాస్ రెడ్డి ను, వార్డెన్స్ అనిత ను , సిబ్బంది కి తగ సూచనలను తెలియజేసినారు. వసతి గృహాలను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి అన్నిటి పైన సంతృప్తి వ్యక్తం తెలిపినట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ , వార్డెన్, కేరటేకర్ లు డా. శ్రీనివాస రెడ్డి, శ్రీమతి. ఇళ్ళందుల సుమలత, శ్రీమతి D. అనిత మరియు సిబ్బంది పాల్గొన్నారు.