నవతెలంగాణ-పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రం ఉన్న బాలుర ఆశ్రమ పాఠశాల, చలకుర్తి గిరిజన బాలుర వసతి గహాలను నల్గొండ డిటిడిఒ లక్ష్మారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బాలుర ఆశ్రమ పాఠశాలలోని తరగతి గదులు, లైబ్రరీ, వంటగది, డైనింగ్ హాల్, ఆటస్థలం, భోజన పదార్ధాలను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. టైం ప్రకారం విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యార్థులందరూ ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధవహించాలని తెలిపారు. ఈయన వెంట వార్డెన్లు బాలకష్ణ, శ్రీనివాస్, రమేష్, ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్ ఉన్నారు.