సర్‌ప్రైజ్‌ చేసే కాన్సెప్ట్‌

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’. మైక్‌ మూవీస్‌ బ్యానర్‌ నిర్మించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ శిష్యుడు డాక్టర్‌ ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వం వహించారు.
అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ ఈనెల 29న రిలీజ్‌ చేయనుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ప్రణవి మానుకొండ మీడియాతో మాట్లాడుతూ.
‘చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మంచి ఆఫర్లు వచ్చాయి. సీరియల్స్‌లోనూ లీడ్‌గా చేశాను.
కానీ నాకు సినిమాలంటే ఇష్టం.
అందుకే ఇటు వైపు వచ్చాను. ‘రొటీన్‌ లవ్‌ స్టోరీ’, ‘ఉయ్యాల జంపాల’తో మంచి గుర్తింపు వచ్చింది. కళ్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’లోనూ నటించాను. నేను చేసిన రీల్స్‌ నుంచి మైక్‌ టీవీ నుంచి ఈ ఆఫర్‌ వచ్చింది. టైటిల్‌ మాదిరిగానే కథ కూడా కొత్తగానే ఉంటుంది. స్క్రిప్ట్‌ అంతా కూడా నవ్వుతూనే చదివాను. ఈ సినిమాలో ఎమోషన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఫన్‌ రైడ్‌తో పాటు ఎమోషన్స్‌ను బ్యాలెన్స్‌ చేశారు దర్శకుడు. నేను చేసిన మౌనిక పాత్ర కూడా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్‌ హీరోయిన్‌ కారెక్టర్‌లా ఉండదు. సంజరుతో ఎంతో ఫ్రీగా, నేచురల్‌గా నటించాను. రెగ్యులర్‌ కారెక్టర్లు కాకుండా.. నేను చేసే పాత్రలకు ప్రాధాన్యం ఉండాలని భావిస్తాను. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే గ్లామర్‌, డీ గ్లామర్‌గానైనా నటిస్తాను. ప్రస్తుతం నా ఫోకస్‌ మొత్తం సినిమాలపైనే ఉంది’ అని చెప్పారు.