నవతెలంగాణ-భిక్కనూర్
సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మండలంలోని దివ్యాంగుల సర్వేను శనివారం ఐ ఆర్ పి మహేందర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను పరీక్షించి ముగ్గురు విద్యార్థులు అంగవైకల్యంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అలాగే అంగన్వాడి కేంద్రంలో సర్వేను నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థుల సర్వే వచ్చే నెల 10వ తేదీ వరకు కొనసాగుతుందని, ఐఆర్పి మహేందర్ తెలిపారు.