
తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన భూమిపుత్ర లైసెన్స్ డ్ సర్వేయర్ చింత రవి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆలేటి అటం అనాధాశ్రమంలోని 50 మంది వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా సర్వేయర్ రవి మాట్లాడుతూ వారి పుట్టినరోజు సందర్భంగా అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు టిఆర్ఎస్ నాయకులు చిర్రబోయిన వెంకన్న, విప్లవ్, వజ్జే నాగరాజు, ఉపేందర్, లింగస్వామి, తిరుమల్, శైలేందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.