
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన ముస్లిం వ్యక్తి విక్రమ్ అలీ అన్నదాన సత్రాన్ని ఏర్పాటుచేసి మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలిచాడు. 11వ వార్డుకు చెందిన విక్రమ్ ఆలీ అదే కాలనీలో సప్త మహా సంఘం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సప్త మహా సంఘం సభ్యులు ఆలిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సప్త మహా సంఘం సభ్యులు పాల్గొన్నారు. హనుమాన్ ఆలయాల వద్ద అన్నదాన సత్రాలు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం హనుమాన్ ఆలయాల వద్ద అన్నదాన సత్రాలను ఏర్పాటు చేశారు. భీంగల్ పట్టణ కేంద్రంలోని బోయ గల్లీ పవనసుత హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ మాల ధరించిన భక్తులు ఈరోజు కొండగట్టు మరియు ఇతర ఆలయాల వద్ద మాల విరమణ చేశారు.