– దేహశుద్ధి చేసిన విద్యార్థి తల్లిదండ్రులు..
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుని దేహాశుద్ధిచేసిన సంఘటన అచ్చంపేట నియోజకవర్గంలో జరిగింది. బాధ్యత కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ విద్యార్థినిని ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పుతో విసిరి కొట్టాడు. విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆ ఉపాధ్యాయునికి పాఠశాలలలోనే దేహశుద్ధి చేశారు. దీంతో విషయం బహిర్గతం అయింది. విద్యార్థినిలు తెలిపిన వివరాల ప్రకారం..తరగతి గదిలో ఇద్దరు విద్యార్థులు ఉపాధ్యాయుని చూసి నవ్వుకున్నారని, అనుమానంతో శ్రీనివాసరెడ్డి తన కాలు చెప్పును తీసుకొని బలంగా విసిరివేశాడు. ఆ చెప్పు ఒక విద్యార్థికి తగలవలసి పోయి మరొక విద్యార్థికి తగిలింది. ఆమెకు చెవి కింది గొంతు భాగంలో స్వల్ప గాయం అయింది. మరో విద్యార్థినికి చెప్పు తాకకపోవడంతో వెంటనే ఆగ్రహంతో వెళ్లి సదరు విద్యార్థిని చేతులతో వీపుపై బలంగా చితక బాదాడని విద్యార్థిని వాపోయింది. రాత్రి ఇంటికి వెళ్లిన విద్యార్థినిని తల్లి అడగడంతో జరిగిన విషయం చెప్పింది. కందిపోయి ఉన్న గాయాలకు తల్లి ప్రథమచికిత్స చేసినట్లు బాలిక తెలిపింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విష్ణుమూర్తిని వివరణ కోరగా.. జరిగిన ఘటన పట్ల ఉపాధ్యాయున్ని మందలించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. జరిగిన విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని తెలిపారు.