రక్తదానం చేసి ఆపదలో ఉన్న ఎందరికో ప్రాణదానము చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇస్తారిగల్ల పవన్ సేవలు ప్రశంసనీయమని దుబ్బాక ఎంఈవో ప్రభుదాస్,పలువురు కొనియాడారు. దుబ్బాక మండలం బల్వంతాపూర్ మండల ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఇస్తరిగల్ల పవన్ బుధవారం సురభి మెడికల్ ఆసుపత్రిలో రక్తం అత్యవసరం ఉన్న రోగికి తన రక్తాన్ని అందించి రోగి ప్రాణాలు రక్షించాడు. ఐతే ఇప్పటికి వరకు 30 మందికి ఓ నెగిటివ్ రక్త గ్రూప్ రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడడంతో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా కమిటీ పవన్ ను, దళిత జర్నలిస్ట్ నాయకులు అభినందించారు.