విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల హెచ్ఎం ప్రమోషన్ కోల్పోయిన ఉపాధ్యాయుడు 

A teacher who lost his HM promotion due to the negligence of the district education department– ఆన్లైన్లో 18వ నెంబర్ స్కూల్ నమోదు చేసి రావాల్సిన ప్రమోషన్ ఇప్పించి నాకు న్యాయం చేయాలి 
– శ్రీరామగిరి గ్రామ యుపిఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు యాదగిరి 
నవతెలంగాణ – నెల్లికుదురు
జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల లెఫ్ట్ ఓవర్ ప్రమోషన్ పొందలేక పోయానని శ్రీ రామగిరి గ్రామ యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పెరుమాండ్ల యాదగిరి తెలిపాడు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉపాధ్యాయుల కు ప్రమోషన్ కల్పించిది. జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యం వల్ల ప్రమోషన్ కోల్పోవాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇటీవల ప్రభుత్వం లెఫ్ట్ అవర్ ప్రమోషన్ లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో అన్ని సబ్జెక్టులతో పాటు పిఎస్ హెచ్ఎం పోస్టుకు 1:1 నిష్పత్తిలో ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసినారు అందులో భాగంగా పిఎస్ హెచ్ఎం పోస్టులు జిల్లా వ్యాప్తంగా 18 ఉన్నాయని తెలిపారు. 18 మంది ఉపాధ్యాయులను సెలెక్ట్ చేశారని తెలిపారు అందులో నేను 18వ వ్యక్తిని అన్నారు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ ఇస్తున్న సమయంలో 18 మంది ఉపాధ్యాయుల పేర్లు, 17 పాఠశాలల పేర్లు మాత్రమే ఆన్లైన్లో కనిపించాయని అన్నారు. దీంతో 18 పాఠశాల పేర్లు చూపించకపోవడంతో నేను హెచ్ఎం గా ప్రమోషన్ కోల్పోయే పరిస్థితి జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నెలకొన్నదని అన్నారు. దీంతో వెంటనే జిల్లా విద్యాశాఖ కార్యాలయం కు  సమాచారాన్ని అందించామని అన్నారు.  దీనికి త్వరలోనే మరొక స్కూళ్లను కలుపుతున్నాం టైం పడుతుంది అని పలుమార్లు చెప్పారు అని అన్నారు కానీ వెబ్ ఆప్షన్ లో ఇచ్చే టైం అయిపోయే వరకు కూడా మరొక స్కూళ్లను అలాట్ చేయకపోవడంతో నాకు వచ్చే ప్రమోషన్ కోల్పోయానని తెలిపారు దీని వల్ల  మొదటి 17 మందికి ప్రమోషన్లు అలట్ చేయబడిందని అన్నారు ఇంకొక స్కూలును అలాట్ చేసినట్లయితే నాకు ప్రమోషన్ వచ్చేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వదిలి నాకు 18వ స్కూలును ఆన్లైన్లో నమోదు చేసి నాకు రావాల్సిన ప్రమోషన్ ఇప్పించాలని కోరుతున్నట్లు తెలిపారు.