శిక్షణలో భాగంగా ఆదిలాబాద్ లో పర్యటిస్తున్న సివిల్ సర్వీస్ శిక్షణ అధికారుల బృందం శనివారం పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించింది. డేవిడ్ వెంకట్రావ్ చనాప్, పవనోట్ కౌర్, సిమ్రన్, ఎం.డి ఖమరోద్దిన్ ఖాన్, మోహిత్ రావత్ లతో కూడిన శిక్షణ సవిల్ సర్వీస్ అధికారుల బృందం తొలుత శనివారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శిచారు. ఎంఈవో సోమయ్య, మున్సిపల్ కమీషనర్ ఖమర్ అహ్మద్, పాఠశాల హెచ్ఎం రమేశ్ లు వారి వెంట ఉండి పాఠశాలలోని మౌళిక వసతులు, విద్యా బోధన, విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి బోధన, అభ్యసన సామర్థ్యాల గురించి వాకబు చేశారు. అనంతరం వారు హమీద్ పూర లోని ఉర్దు మీడియం పాఠశాలను సందర్శించారు. హెచ్ఎం అస్లాం ఉపాధ్యాయులు, విద్యార్తులతో కలిసి వారికి స్వాగతం పలికారు. పాఠశాలలోని తరగతి గదులు, గ్రంథాలయం, క్రీడా మైదానం, మద్యాహ్న భోజనం, కిషెన్షీడ్డు, మరుగుదొడ్లు తదితర అంశాలను పరిశీలించారు. వారి వెంట కౌన్సిలర్ యెనగంటి ప్రకాష్, లైజన్ అధికారి పన్నాలాల్, వార్డు ఆఫీసర్ పాషా, మెప్మా టీఎంసీ భాగ్యలక్ష్మి ఉన్నారు.
శిక్షణలో భాగంగా పర్యటిస్తున్నాం
ఈ సందర్భంగా శిక్షణ సివిల్ సర్వీస్ అదికారిణి పవన్ జోట్ కౌర్ మాట్లాడుతూ.. శిక్షణలో భాగంగా ఆదిలాబాద్ లో పర్యటిస్తున్న తాము ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యబోధన సాగుతోందని, అన్ని రకాల మౌళిక వసతులు ఉన్నాయని వివరించారు. మద్యాహ్న భోజనం, మంచినీరు, క్రీడా మైదానం అన్ని బాగున్నాయన్నారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా రెండేసి తరగతులను ఒకే చోటు కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్న విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు.