నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లా పత్తి రైతులు గూడుగోన విధానంతో తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. గుజరాత్ తరహాలో ఆదిలాబాద్ పత్తి రైతులకు పత్తి ధరను అందించడం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కలిసి వినతి పత్రం అందజేశారు. గుజరాత్ పర్యటనకు సైంటిస్టులతో పాటు ప్రత్యేక బృందాన్ని ఇప్పించాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్,రోకండ్ల రమేష్, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్, సేవ్వా జగదీష్, కుమ్రా రాజు, వేణు యాదవ్, పరమేశ్వర్ ఉన్నారు.