నవతెలంగాణ- మల్హర్ రావు
గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రైతుబంధు అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బండం లక్ష్మారెడ్డికి అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. ఆదివారం మహాదేవపూర్ మండలం బొమ్మపూర్ గ్రామంలో జరిగిన లక్ష్మారెడ్డి అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హాజరయ్యారు. లక్ష్మారెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.