భారత్ గ్యాస్ బాజన్నకు కన్నీటి వీడ్కోలు..

నవతెలంగాణ – ఆర్మూర్ 

 పట్టణానికి చెందిన భారత్ గ్యాస్ సంస్థలో చాలా ఏళ్ళ నుండి సేవలందిస్తూ గురువారం రాత్రి. అకాల మరణం చెందాడు భారత్ గ్యాస్ భాజన్న పట్టణంలోని  లోని ప్రతి కుటుంబంతో సత్  సంబంధాలు ఏర్పరచుకొని ఆత్మీయ బంధువుగా ఫోన్ చేస్తే చాలు సిలిండర్ తీసుకొచ్చి ఇంటిలో దింపే తన వృత్తి సేవా గుణం,మాట,మర్యాదతో మాట్లాడడం తన ప్రవృత్తి, నిన్న రాత్రి ఆకస్మికంగా మరణించారు. అందరివాడుగా సేవలందిస్తూ కోపముకింతైనా కానరాని అజాత శత్రువుగా సవేరా గ్యాస్ యజమాన్యంతో కలిసి పనిచేసిన సేవలు భారత్ గ్యాస్ వినియోగదారుల గుండెల్లో గుడి కట్టుకున్న తీరుతెన్నులు అజరామరంగా చరిత్రలో నిలిచిపోతాయని, ప్రతి వినియోగదారుడు భారత్ గ్యాస్ భాజన్న లేని లోటు తీరనిదని,శోకతప్త   హృదయాలతో బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వినియోగదారులు భాజన్న సేవలను శ్లాఘిస్తూ,అభినందిస్తూ అంతిమయాత్రలో అంత్యక్రియల్లో కన్నీటి వీడ్కోలు పలికారు.