
చౌటుప్పల్ దండు మల్కాపురం గ్రామంలో శ్రీ అందోల్ మైసమ్మ మినీ గూడ్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వరంలో శుక్రవారం యూనియన్ ఉపాధ్యక్షులు చిలువేరు ఎల్లయ్య గుండె నొప్పితో అకాల మరణం చెందడం జరిగింది. ఇతనికి భార్య ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య భౌతికాయంపై పూల మాల వేసి పుష్ప గుచ్చాలు ఉంచారు.ఎండి పాషా మాట్లాడుతూ.. ఎల్లయ్య మినీ గూడ్స్ సంఘం కోసం ఎనలేని కృషి చేశారని,వీరు చేస్తున్న పనిని నమ్ముకుని ఇటు సంఘాన్ని తన పనిని నమ్ముకుని సంగం బలోపేతం కోసం అనేక మైన పోరాటాలు చేశారని ఎండి పాషా కొనియాడారు. ఎల్లయ్య మరణం సంఘానికి తన స్నేహితులకు తీరని లోటుని, ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల వలె ఎల్లయ్య కుటుంబానికి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎండి పాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్ యూనియన్ అధ్యక్షులు జొన్నకండి దేవయ్య ప్రధాన కార్యదర్శి బోదుల లింగస్వామి నాయకులు దేవరాయ సుధాకర్,దేవరాయ కృష్ణ,ఓరుగంటి శ్రీను గౌడ్,కొన్ రెడ్డి యాదగిరి, కప్పరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.