నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని బురహాన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ గత నాలుగు రోజుల క్రితం దుండగుల చేతుల్లో హత్యకు గురికాగా బుధవారం దహన సంస్కరాలు నిర్వహించారు. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన దేవేందర్ ను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎప్పుడు అందరితో ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి హత్యకు గురి కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపల్చుకునేవాడని గ్రామస్తులు అంటున్నారు. కల్మషం లేని వ్యక్తి కడసారి చూపు కోసం వందల మంది ప్రజలు తరలివచ్చారు. గ్రామస్తులు దేవేందర్ లేడనే బాధను గుండెల్లో దాచుకొని డబ్బు చెప్పులతో, కోలాట ఆటపాటలతో అంతిమయాత్రలో పాల్గొన్నారు.