మురికి గుంటను తలపిస్తున్న దేవాలయం బావి….

– మురుగు నీరుగా మారిన పవిత్ర జలం…
– మూడు బాటిల్ ఆరు క్యాన్ లు గా వర్ధిల్లుతున్న మినరల్ నీటి వ్యాపారం….
– భక్తులకు ప్రియంగా మారిన తాగునీరు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ చిత్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలు గ్రామంలో మురికి గుంట అనుకున్నా, ఆ నీరు మురుగు నీరు అని భ్రమ పడినా పప్పులో కాలేసినట్టే నండోయ్. ఇదో పవిత్ర దేవాలయం ప్రాంగణం లోగా పవిత్ర శుద్ధి జలంతో ఉండే బావి. ఈ బావి లో పొరపాటున గానీ, కావాలని గానీ పడిపోకుండా, వ్యర్ధాలు పడకుండా కూడా బావి పైన జాలీ కూడా ఏర్పాటు చేసారు దేవాలయం అధికారులు. కానీ అందులో కనిపించే వ్యర్ధాలు అందులోని ఎలా చేరాయి అనేది ఆ దేవత కే ఎరుక.ఆ పరిసర ప్రాంతంలో నీటి వ్యాపారం చేసేవారికి ఎరుక. మరి బావి ఇలా ఉంది ఏంటి? ఈ నీటిని భక్తులు ఎలా సేవిస్తున్నారు అనుకుంటున్నారు కదూ. అయితే ప్రస్తుతం మినరల్ వాటర్ పేరున ఎక్కడపడితే అక్కడ శుద్ది జలం ప్లాంట్ వెలిసాయి కదా.
ఇక విషయానికి వేస్తే..
అశ్వారావుపేట మండలం వినాయకపురం పంచాయితీ పరిధిలో గల చిలుకలు గండి ముత్యాలమ్మ దేవాలయం ప్రాంగణంలోని బావి.మినరల్ వాటర్ అందుబాటులో లేని సమయంలో ఈ నీరే భక్తులకు ప్రాణాధారం. ఈ దేవాలయం అశ్వారావుపేట – భూర్గంపాడు ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో నిత్యం రాకపోకలు సాగించే పాదచారులు, వాహనదారులు, ప్రతీ ఆదివారం ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ఈ బావి నీరే ప్రధాన వనరు.ఈ నీరు సైతం ఎంతో రుచిగా ఉంటుందని కూడా అనేకమంది భక్తులు చెపుతున్నారు. కొందరు అయితే ఈ నీటికీ రుచి, దేవాలయం ప్రాంగణంలో ఉందనే పవిత్ర భావంతో ఈ నీటిని బాటిల్స్ లో తీసుకుని వెళ్తుంటారు. ఇంత పవిత్రం అయిన ఈ నీరు ఇలా కావడానికి కారకులు ఎవరు? బావిపై జాలీ ఉన్నా వ్యర్ధాలు లోపలికి వెళ్ళాయి అనేది అంతుపట్టని ప్రశ్న. ఇప్పటికైనా ఈ బావి ని శుభ్రం చేసి,ఈ నీటిని తాగు యోగ్యంగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు.త్వరలో జాతర ఉన్నందున ఈ బావిని పునరుద్ధరించి భక్తులకు సరిపడా నీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.

శుభ్రం చేయిస్తాం – దేవాలయం ఈ.ఒ సూర్యప్రకాశ్
ఈ బావి దుస్థితి పై ఈ.ఒ సూర్యప్రకాశ్ ను వివరణ కోరగా “నేను తాగేది ఆ భావి నీరే” అంటూ సమాధానం ఇచ్చారు.ఆ ఫోటోలు వాట్సాప్ పంపి ఈ నీరా మీరు తాగేది అని అడిగితే నాలుక కార్చుకున్నారు.జాలీ ఉన్నా లోపలికి వ్యర్ధాలు ఎలా వెళ్ళాయి అంటూ అనుమానం వ్యక్తం చేసారు ఆయనే!?.
చాపర్ల వేణు భక్తుడు : ఈ బావి నీటిని ఎంతో పవిత్రంగా భావిస్తాం.గతంలో ఈ దేవాలయానికి వచ్చిన ప్రతీ సారి బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళం.ఇటీవల నే ఇలా దుర్గంధం అయింది.నిర్వహణ సరిగ్గా లేకపోవడమే కారణం.ఈ బావిని శుభ్రం చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలి.