– 44 మంది మృతి
ఢాకా: ఢాకాలో గురువారం రాత్రి సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 44 మంది మరణించారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఢాకా బెయిలీ రోడ్డులోని ఏడంతస్తుల రెస్టారెంట్‌లో గురువారం రాత్రి మంటలు చెలరేగాయని, అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల సేపు శ్రమించి వీటిని అదుపులోకి తెచ్చాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపు చేయడం కొంత కష్టతరమైందని అన్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే ఈ మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.