అల్లు అర్జున్ సాధించిన ఈ అద్భుతమైన విజయం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఆయన జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంతో పాటు, ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు నటుడిగా నిలవడం గర్వంగా ఉంది. అతని అసాధారణమైన ప్రతిభను, నిబద్ధతను గుర్తించే మరిన్ని పురస్కారాలతో అలంకరించబడిన భవిష్యత్తు దగ్గర్లోనే ఉంది’ అని రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ‘కమర్షియల్ సినిమా పాటలకు కొత్త అర్థం చెప్పిన దిగ్గజ స్వరకర్త ఎం.ఎం. కీరవాణి ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి స్మారక చిత్రానికి గానూ ఒకే ఏడాది అటు ఆస్కార్, ఇటు జాతీయ పురస్కారం గెలుచు కోవడం అభినందించదగ్గ విషయం. కాలభైరవ, శ్రీనివాస్ మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలమన్‌లకు అభినందనలు. ముఖ్యంగా మన తెలుగు సినిమా కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఎస్.ఎస్.రాజమౌళికి ధన్య వాదాలు. తమ తొలి చిత్రం ‘ఉప్పెన’తో జాతీయ అవార్డును గెలుచుకున్న బుచ్చిబాబు, పంజా వైష్ణవ్ తేజ్‌లకు శుభాకాంక్షలు. అలాగే, గీత రచయిత చంద్రబోస్ ‘కొండపొలం’ సినిమాకు జాతీయ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకోవడం నాకు హదయం సంతోషంతో నిండిన క్షణం’ అని తెలిపారు.