క్యూనెట్‌పై సమగ్ర విచారణ జరపాలి

– టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదంలో క్యూనెట్‌ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. యువతీ, యువకులు దుర్మార్గపు సంస్థ క్యూనెట్‌ వలలో చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌ నిఘా పెట్టాలని చెప్పారు.