నవతెలంగాణ డిచ్ పల్లి : డిచ్ పల్లి మండలం లోని మెంట్రాజ్ పల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా వీధి విధానాలకు సంబంధించిన రైతుల అభిప్రాయాలు వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. పంట పండని బీడు భూములు, వెంచర్లు, రోడ్లు, శిఖం భూములు ఇల్లు రెవెన్యూ శాఖ వారిచే సమగ్రంగా సర్వే చేయించి వాటిని ధరణి నుంచి తొలగించి వ్యవసాయ శాఖకు అందించి నప్పుడే వారికి రైతు భరోసా అందజేయాలని పలువురు పేర్కొన్నారు. రైతు భరోసాను 10 ఎకరాల లోపు గల రైతులకు ఇవ్వాలని,వ్యవసాయ సాగు భూమికి మాత్రమే రైతు భరోసాను ఇవ్వాలని మరికోందరు వివరించారు.రైతు భరోసా సకాలంలో అనగా సీజన్ ప్రారంభమయ్యే ముందు అందించాలని కోరారు.రైతు యొక్క చిన్నచిన్న అవసరాలు నిమిత్తం బ్యాంకుల్లో లోన్ కొరకు ఐటీ రిటర్న్ ఫైల్ చేయవలసి వస్తుందని, అర్హులైన రైతుల వివరాలు బ్యాంకు ద్వారా సేకరించి వారికి కూడా రైతు భరోసా ఇవ్వగలని ఇంకోదరు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి డిడిఏ నిజామాబాద్ తిరుమల ప్రసాద్, ఏ డి ఏ ప్రదీప్ కుమార్ , మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, రాజేందర్, హీర, దీపిక, సహకార సొసైటీ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, రామచందర్ గౌడ్ తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.