వెర్రి వేయి విధాలు…

చెప్పెటోడు చెప్పుకుంటూ పోతున్నా.. వినెటోడికి వివేకం ఉండాలంటారు విజ్ఞులు. సాంకేతికత బాగా పెరిగి, సంపాదన చుట్టే పరుగులు పెడుతున్న నేటి జనాలకు ఇలాంటి మంచి మాటలు చెవికెక్కవు. అందుకే మన చుట్టూ ఏం జరుగుతుందో గమనింకుండా వాట్సాప్‌లు, ఫేసుబుక్కులు, యూట్యూబ్‌లు, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎవరో ఏదో చెప్పారని.. దాన్నే ఫాలో అవటం రివాజుగా మారింది. పిచ్చిముదిరి పాకాన పడ్డట్టు ఆటల గురించో, సినిమా స్టార్ల గురించో సోషల్‌మీడియాను నమ్మితే ఫరవాలేదు. కానీ ఏకంగా జీవితాలనే ప్రభావితం చేసే ఆర్థిక పరిస్థితులు, ఆదాయమార్గాలు, ఆరోగ్య సూత్రాలు, దీర్ఘకాలిక వ్యాధులకు నివారణోపాయాల గురించి సామాజిక మాధ్య మాల్లో చెపపిన దాన్నే బలంగా నమ్ముతున్న కొన్ని అమాయక జీవులు… చివరికి అవన్నీ బూటకమని తేలిన తర్వాత అంతే అమాయకంగా బలైపోతున్నారు, బలవన్మ రణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆంధ్రాలోని కృష్ణా జల్లలో ఓ గృహిి తమకున్న అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో రుణం కోసం సోషల్‌ మీడియాలో వచ్చిన ఓ ప్రకటన చూసింది. అందులోని నియమ నిబంధనల ప్రకారం రూ. పది వేలు, ఇరవై వేలు, ముప్పై వేలు… ఇలా లక్షన్నర వరకూ కట్టి, ఆ తర్వాత అది ోసమని తేలటంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనను మరవకముందే తెలంగాణలోని ఓ జిల్లాలో ‘కేవలం మేం పంపే యాడ్స్‌ చూడండి…నెలకు పది నుంచి పదిహేను వేలు సంపాదిం చండి…కాకపోతే మీరే ముందు ఓ ఐదువేలు కట్టండి…’ అంటూ వచ్చిన ఓ ప్రకటన చూసి, వందలాది మంది ఐదువేల చొప్పున కట్టి, జేబులు గుల్ల చేసుకున్నారు. తీరా విషయం తెలిశాక లబోదిబోమంటున్నారు. ఇవేగాదు… ఇటీవల రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరగటంతో వాటిపై యూట్యూబుల్లో వెతికేవారి సంఖ్య లక్షల్లో ఉంటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రుల్లో చూపించుకోకుండా యూట్యూబ్‌లో చెప్పినదాని ప్రకారం మందులు వాడితే… ప్రాణాల మీదికి కొని తెచ్చుకోవటమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక రీల్స్‌ చేయటం కోసమని యువత రకరకాల ఫీట్లు చేస్తూ ప్రమాదాల బారిన పడుతుండటాన్ని రోజూ పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అందుకే సామాజిక మాధ్యమాను ఎంతవరకు వాడాలో అంతవరకే వాడదాం. వాటిలో వచ్చే కంటెంట్‌ను ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముదాం…
-బి.వి.యన్‌.పద్మరాజు