నవతెలంగాణ కంటేశ్వర్
భారత రాజ్యాంగ నిర్మాత ఆధునిక గౌతమ బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానం ఇంకా వెయ్య సంవత్సరాలైన సజీవంగా ఉంటుందని
బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ తెలిపారు.ఈ మేరకు ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలాంగ్ లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడడీనాయకత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానం ద్వారా రూపొందించిన భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక భద్రత, సంక్షేమం, రిజర్వేషన్లు ,విద్యా, వైద్యం ,ఉపాధి కల్పన తదితర మౌలిక సదుపాయాలను రద్దుచేయాడానికి బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, బిఎల్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ , జిల్లా ఉపాధ్యక్షులు టి. రాజ్ కుమార్,బిఎల్ టియు నగర అధ్యక్షులు తిట్టే రాజు ప్రధాన కార్యదర్శి గంగా శంకర్ , మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (బి ఎల్ టి యు) జిల్లా నాయకులు జి.యాదయ్య, మున్సిపల్ డ్రైవర్స యూనియన్ బి ఎల్ టి యు నాయకులు నవీన్, రవి కుమార్, బిడిఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీ మాన్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి నాయకులు చిన్ను బాయి, భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు అక్బర్, కార్యదర్శి రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.