థ్రిల్‌ చేసే అన్వేషి

ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘ఏదో ఏదో కలవరం’ అనే పాటను భీమ్స్‌ సిసిరోలియో రిలిజ్‌ చేశారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఈ పాటను చైతన్య వర్మ రాశారు. అనురాగ్‌ కులకర్ణి, దీప్తి ప్రశాంతి పాటను ఆలపించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా ఇది. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతపరంగా మంచి ఎఫర్ట్‌ పెట్టారు’ అని తెలిపారు. ‘మా డైరెక్టర్‌ మంచి కథ, స్క్రీన్‌ప్లేతో చేశారు. షూటింగ్‌ అంతా పూర్తయ్యింది. మే రెండో వారంలో రిలీజ్‌ చేస్తాం. చైతన్‌ భరద్వాజ్‌ అద్భుతమైన పాటను ఇచ్చారు. ప్రేమ్‌ రక్షిత్‌ చక్కటి డాన్స్‌ కంపోజ్‌ చేశారు. మా బ్యానర్‌కి ఈ సినిమా మైల్‌ స్టోన్‌గా నిలుస్తుంది’ అని నిర్మాత తెలిపారు.