థ్రిల్‌ చేసే ‘హత్య’

A thrilling 'murder'మహాకాల్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ ప్రశాంత్‌ రెడ్డి నిర్మాణంలో శ్రీ విద్యా బసవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హత్య’. ఈ చిత్రంలో ధన్య బాలకష్ణ, పూజా రామచంద్రన్‌, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈనెల 24న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ, ‘కరోనా వల్ల నా తొలి సినిమా ‘మధ’ సక్సెస్‌ను ఎంజారు చేయలేకపోయాను. ప్రశాంత్‌ వల్ల ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది. అలాగే మా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక డిస్ట్రిబ్యూటర్లే వచ్చి మా సినిమాను అడిగారు. మేం సినిమా చూశాం. మాకు నమ్మకం పెరిగింది. ఈ సినిమా పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని తెలిపారు. నిర్మాత ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘మా డైరెక్టర్‌ శ్రీవిద్యకు థ్యాంక్స్‌. ఈ సినిమాకు నేను ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. మా సినిమాని అందరూ చూసి ఎంజారు చేయండి’ అని అన్నారు.