దర్శక, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన చిత్రం ‘ఎం4ఎం’ (మర్డర్ ఫర్ మోటీవ్). ప్రతిష్టాత్మక గోవా ఫిలిం ఫెస్టివల్‌లోని (ఇఫీ) కళా అకాడమీ వేదికపై ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసి యేషన్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ చేతుల మీదుగా ఈ చిత్ర హిందీ ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఆసక్తికర కంటెంట్‌తో ఇటువంటి చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల కోసం గొప్ప ప్రయత్నం చేసినందుకు దర్శక, నిర్మాత మోహన్ వడ్లపట్లను అభినందిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్న జో శర్మకి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు. దర్శక, నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, ‘ఈ సబ్జెక్ట్ యూనివర్సల్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు మా మూవీని చూసి థ్రిల్ అవుతారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఈ సినిమాతో సంబీత్ ఆచార్య, జోశర్మలకు పాన్ ఇండియా స్కేల్‌లో కొత్త అధ్యాయం మొదలవుతుంది’ అని తెలిపారు. ‘మా మూవీ ట్రైలర్‌ను గోవాలో లాంచ్ చేయటం కొత్త అనుభూతిని ఇచ్చింది. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కొత్తగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో రావడం 110 ఏళ్ల సినీ చరిత్రలో ఫస్ట్ టైమ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయడం గర్వంగా ఉంది’ అని జోశర్మ చెప్పారు.