థ్రిల్‌ చేసే జీబ్రా

A thrilling zebraహీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్‌ డాలీ ధనంజయతో ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘జీబ్రా’. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై ఎస్‌ ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మిస్తున్నారు. సత్యదేవ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. బ్యాగ్‌, మరో చేతిలో పెన్నుతో బ్యాక్‌ గ్రౌండ్‌ పోస్టర్‌లో సత్యదేవ్‌, కరెన్సీ నోట్లను చూపించారు. సినిమాలో సత్యదేవ్‌ క్యారెక్టర్‌ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో ఫస్ట్‌ లుక్‌ ద్వారా తెలుస్తోంది. లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. షూటింగ్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్‌ చేయనున్నారు మేకర్స్‌. ఈ క్రైమ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ప్రియా భవానీ శంకర్‌, జెన్నిఫర్‌ పిక్కినాటో హీరోయిన్స్‌గా నటిస్తు న్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈసినిమా విడుదలకు సంబంధించి అనౌన్స్‌మెంట్‌ని మేకర్స్‌ చేయనున్నారు.