మొత్తం 1,906 వినతులు

– ప్రజావాణికి అనుహ్య స్పందన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభించింది. అర్జీదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుండటంతో ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను అధికారులు తెలుసుకునీ, వారి అర్జీలను తీసుకునీ, ప్రతి అర్జీకి ఒక నంబర్‌ను కేటాయిస్తున్నారు. అలాగే దరఖాస్తుదారుల రిఫరెన్స్‌ కోసం వారి సెల్‌ ఫోన్‌ నంబర్‌కు సంక్షిప్త సందేశం కూడా పంపుతున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి గత నెల 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 1,906 వినతి పత్రాలు అందాయని ప్రజా భవన్‌ అధికార వర్గాలు తెలిపాశాయి.