అక్రమంగా అటవీ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్ సీజ్..

The tractor that is illegally flattening the forest land is seized.– రేంజ్ అధికారి రవి మోహన్ భట్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
అడవిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఒక ఎకరం వరకు భూమి నుంచి చదును చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని రేంజ్ కార్యాలయానికి తరలించి సీజ్ చేసినట్లు ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ పేర్కొన్నారు. రేంజ్ కార్యాలయంలో ట్రాక్టర్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఇందల్ వాయి రేంజ్ పరిధిలోని దర్పల్లి సెక్షన్ లోని గుడి తండా ముద్దుల్ అడవి ప్రాంతంలో శనివారం వెకువ జామున గుడి తండా కు చెందిన మేగవత్ రాందాస్ అదే తాండకు చెందిన మెగావా దేవిదాస్ ట్రాక్టర్ ను తీసుకొని అడవిలో ఒక ఎకరం వరకు ఆక్రమంగా భూమిని చదును చేస్తున్నారని ఇందల్ వాయి డిప్యూటీ రేంజ్ అధికారి తుకారం రాథోడ్ కు సమాచారం వచ్చిన వెంటనే సిబ్బంది తో అక్కడికి వెళ్లి పరిశీలించాగా ట్రాక్టర్ తో చదును చేస్తుండగా పట్టుకొని రేంజ్ కార్యాలయానికి తరలించి ఉన్నతాధికారులకు ఘటనా విషయం వివరించడం జరిగిందన్నారు.ఉన్నతధికారుల ఆదేశాల మేరకు ఆక్రమంగా చదును చేస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకొని ట్రాక్టర్ ను సీజ్ చేయడం జరిగిందని, రాందాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని రేంజ్ అధికారి రవి మోహన్ భట్ వివరించారు. ఈ దాడిలో ఒన్నజీపేట్ సెక్షన్ అధికారి భాస్కర్, బీట్ అధికారులు ఖదీర్, దిలీప్, ప్రశాంత్, బేస్ క్యాంప్ సిబ్బంది గణేష్ ,విలాస్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.