నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ లో గ్రామానికి చెందిన రైతు మోహన్ నాయక్ ఫాలీ హౌస్ లో సాగు చేస్తున్న ఆర్కిడ్ పూల తోటను ట్రైని అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఆర్కిడ్ పూల తోట పెంపకంలో గల సస్యారక్షణ విధానంను, అదేవిధంగా మార్కెటింగ్ లో సమస్యలను, పరిష్కార మార్గాలను, పూల సాగు వల్ల వచ్చే ఆదాయం ఇతరత్రా వివరాలను రైతు మోహన్ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు. హాసకొత్తూర్ లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు, మార్కెటింగ్ లో గల సమస్యలను గ్రామంలోని రైతులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ కు గ్రామస్తులు రైతులు ఘన స్వాగతం పలికారు. ఫాలీ హౌస్ ఆర్కేడ్ పూల తోటను పరిశీలించేందుకు వచ్చిన సంకేత్ కుమార్ కు రైతు మోహన్ నాయక్ పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ బి. రాజు, ట్రైని కలెక్టర్ సీసీ, రైతులు పడిగేలా ప్రవీణ్, ఏనుగు మనోహర్, మేడపు రమేష్, కిషన్ గౌడ్, మురళి, రఘు, ఇతర రైతులు, తదితరులు పాల్గొన్నారు.