
నవతెలంగాణ – భువనగిరి
ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 27 వ తేదీన వరంగల్ -ఖమ్మం -నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ పురస్కరించుకొని 25 వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుండి 27 వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు జిల్లాలో అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ చేయబడతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను బంద్ చేయడం జరుగుతుందని, దీనిని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968, సెక్షన్ 20 (1) ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.