నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్ ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన జంటలను ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్ బుధవారం సత్కరిం చింది. అనంతరం సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ క్లినిక్ హెడ్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పరీ నాజ్ పర్హార్ మాట్లాడుతూ తల్లులందరికీ తన హదయ పూర్వక శుభాకాంక్షలు చెప్పారు. జంటలు తల్లిదండ్రులు కావాలనే వారి కలలను ఒయాసిస్ ఫెర్టిలిటీలో సహాయ పడటానికి అధునాతనమైన సంతానసాఫల్య చికిత్సలను అందిస్తున్నామని తెలిపారు. వయస్సుతో పాటు సంతానో త్పత్తి సామర్థ్యం తగ్గుతూ వస్తుందని.. అందువలన సంతానం కోరుకునే జంటలు ఎటువంటి ఆలస్యం లేకుండా సంతానసాఫల్య చికిత్స సహాయాన్ని పొందడం చాలా ముఖ్యమని సూచించారు. ఆండ్రోల్కెఫ్ అనేది పురుషుల కోసం ప్రత్యేకమైన సంతానసాఫల్య క్లినిక్‌లు అని.. వీటి ద్వారా తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్న పురుషులు కూడా మైక్రోటీఈఎస్‌ఈ వంటి అత్యాధునికమైన స్పెర్మ్ రిట్రీవల్ టెక్నిక్‌లను ఉపయోగించి పితత్వాన్ని సాధించేలా చేస్తామని చెప్పారు. ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ వంటి అధునా తన పద్ధతుల ద్వారా క్యాన్సర్ రోగులు తమ క్యాన్సర్ చికిత్సలకు ముందు సంతాన సాఫల్యతను కాపాడుకోవడం ద్వారా తల్లిదండ్రులు అయ్యే అవకాశాన్ని పదిలం చేసుకోవచ్చు అన్నారు. హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్లో భాగమైన ఒయాసిస్ సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అత్యుత్త మ వైద్య నియమావళిని, పద్దతులను అందుబాటులోకి తీసుకురాడం ద్వారా దక్షిణ భారతదేశంలో సంతాన సాఫల్యానికి ఒక సరి కొత్త నిర్వచనం ఇచ్చింది. 2009లో స్థాపించినప్పటి నుంచి ఒయాసిస్ అంతర్జాతీయ అనుభ వంతో అత్యంత అనుభవజ్ఞుల్కెన ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ల బందం నేతత్వంలో అధిక నాణ్యత సేవల ద్వారా నడిచే అధిక విజయాల రేట్‌తో అద్బుతమైన ఖ్యాతిని పొందింది. ఒయాసిస్‌కుó ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఝార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ిశా రాష్ట్రాలలో ప్రస్తుతం 30 కేంద్రాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.