– నిలిచిపోయిన రాకపోకాలు
నవతెలంగాణ – పెద్దవూర
మండలం పరిధిలోని చలకుర్తి -కుంకుడు చెట్టు తండా, జవహర్ నవోదయ విద్యాలయం, తూర్పు పూలగూడెం మార్గంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు రోడ్డు పక్కన ఉన్న పెద్ద తుమ్మ చెట్టు విరిగి రహదారికి అడ్డంగా పడిపోయింది.దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.అంతే గాక హరితహారంలో భాగంగా రోడ్డుకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చెట్లకొమ్మలు తొలగించాలని కోరుతున్నారు.