
– అధికారులను ప్రశంసించిన పలు గిరిజన సంఘాలు
నవతెలంగాణ -తాడ్వాయి
గత రెండు రోజుల నుండి విస్తారంగా కురిసిన వర్షాలకు రవాణా సౌకర్యం లేని ముంపు ప్రాంతాలైన బంధాల గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన లక్ష్మి అనే ఆదివాసి గర్భిణీ స్త్రీని జిల్లా వైద్యాధికారి మండల ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల ప్రకారం ఏజెన్సీలోని రవాణా సౌకర్యం లేని ముంపు ప్రాంతాల నుండి గర్భిణీ స్త్రీలను ముందస్తుగా జిల్లా వైద్యశాలకు పంపించిన విషయం విధితమే. అల్లిగూడెం గ్రామానికి చెందిన సాంబ లక్ష్మి అనే ఆదివాసి గిరిజన గర్భిణీ స్త్రీ అధికారుల చొరవ తో గురువారం ములుగు ఏరియా హాస్పిటల్ లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ గిరిజన మహిళ రవాణా సరిగా లేక వాగులు పడి ప్రాణాపాస్థితిలోకి వెళ్లేదని ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్డారు. కానీ ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి అప్పయ్య చొరవతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నందుకు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వైద్యాధికారి, ప్రత్యేక అధికారి అప్పయ్య, ఏరియా హాస్పిటల్ వైద్యులు సిబ్బందిని పలు ఆదివాసి సంఘాలు, ఆదివాసి గిరిజన ప్రజలు అధికారులను ప్రశంసించారు.