
మండలంలోని బంజేరుపల్లి లంబాడి తండా గ్రామానికి చెందిన గిరిజన దంపతులు నున్సావత్ మోతిలాల్ నాయక్- లలిత ల కుమారుడు ప్రవీణ్ కుమార్ నాయక్ ప్రభుత్వం వెల్లడించిన గ్రూప్ ఫోర్ ఫలితాలలో ఉద్యోగం సాధించి లంబాడి తండా గిరిజనులకు ఆనందం కలిగించాడు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ తండావాసులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రూప్ 1 ప్రిలిమనరీ ఉత్తీర్ణత సాధించి మెయిన్ ఎగ్జామ్స్ కూడా రాశానని ఫలితాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తనకు అండగా ఉంటూ తన చదువుకు అహర్నిశలు కృషి చేసిన తన తల్లిదండ్రులకు అభినందించిన తోటి సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.