ప్రాచీన సంస్కృతిని భుజాలపై మోసే తెగ

సంస్కృతిని

లంబాడీలు, భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన తెగలలో ఒకటి. వారి సంచార జీవనం, అద్భుతమైన ఆభరణాలు, సంగీతం, నత్యాలు వారిని ప్రత్యేకంగా గుర్తించే అంశాలు. లంబాడీ తెగ బంజారా తెగలలో అతి పెద్దది. భారత ఉపఖండంలో లంబాడీ తెగను అది ప్రాచీన జాతిగా నిర్ధారించడానికి పలుచారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆర్‌ కనిట్కర్‌1930లో రచించిన ‘ది హిస్టరీ ఆఫ్‌ ఇండియా’ గ్రంథంలో లమాని వ్యాపార మార్గాలు క్రీ.పూ. 600 నుండి క్రీ.శ. 350 మధ్యకాలంలోనే ఉన్నాయని వివరించారు. లంబాడీలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విభిన్నమైన పేర్లతో పిలవబడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో లంబాడీలు, ఉత్తరాది రాష్ట్రాలలో బంజారాలు, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో సుగాలీల గాను, తెలంగాణ ప్రాంతంలో లంబాడీలు గాను పిలవబడుతున్నారు. లంబాడీలు ప్రత్యేక సంస్కతిక లక్షణాలు కలిగి సొంత అస్తిత్వం కలవారు కావడం వల్ల దేశ సంచార జీవనం వల్ల, వారు భారతీయ సంచారజాతిగా మనగలుగుతున్నారు.
భారతదేశంలో లంబాడీలను బంజారా, బలాడియా, బనజరా, బంజారి, బంజారే, బ్రింజారి, బ్రిజ్‌ వాసి, గవారా గవారియా, గమాలయా, గహర్‌, కంగసియా, లమాడా, లంబాడీ, లంబాడా, లదేనియ, లాభన, లభిని, ఫణద్‌, సిరికింబాండ్‌, సిరికివాలా, సింగడివనజారి అనే వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నారు. లంబాడీల మూలాలు గురించి ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ, వారు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని నమ్ముతారు. వారు మొగలాయి సామ్రాజ్యం కాలంలో సైన్యానికి సరుకులు రవాణా చేసేవారు. కాలక్రమంలో వారు దక్షిణ భారతదేశంలో స్థిరపడి, తమ ప్రత్యేకమైన సంస్కతిని అభివద్ధి చేసుకున్నారు.
లంబాడీల సంస్కతి సంప్రదాయాలలో పండుగలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీరి పండగలలో ముఖ్యమైనవి హోలీ పండుగ, తీజ్‌, శీతల భవాని పండుగ, తుల్జా భవాని, మంత్రాలు యాడి పూజ, దసరా, దీపావళి, సేవాబాయీ, హాదీరాంబావాజీ. వీరి పండుగలన్నీ కూడా వ్యవసాయ భూమికి, ప్రకతి దేవతలకి చాలా దగ్గరగా వుంటుంది. ప్రకతిని దైవత్వాన్ని ఏకం చేసి పండగ చేసే విధానం నేటి ప్రపంచీకరణలో అనేకమంది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వీరి ఆహార పదార్థాలు చాలా పుష్టిగా, బలిష్టంగా వుంటాయి. ప్రకతి పరమైన ఆహార పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. చూర్మో, పిప్సో, పాప్సో-లాప్సి, నలోయ, గలవని, రబడి, కాడో, సునావళి, బోటి-బాటి, తోడిటదిచాటి, సంగటి, ఘోటా వంటి వీరి ఆహార పదార్థాలలో మిరియాలు, బెల్లం, చపాతీ, కొబ్బెర, సొంటి, గోధుమ రవ్వ, నెయ్యి వంటి జీర్ణానికి వీలైన పుష్టికరమైన ఆహార పదార్థాలను ఉపయోగిస్తారు.
గోర్‌ బోలి లంబాడి మాతభాష. ఇది ఇండో ఆర్యన్‌ భాషా సంతతికి చెందినది. ఈ భాషకి లిపి లేదు. అయినప్పటికీ వీరి సామాజిక, సంస్కతిక అస్తిత్వానికి గోర్బోలి భాష మూలాధారం.
లంబాడీల సామాజిక వ్యవస్థ పటిష్టమైనది. ఇప్పటికీ చెక్కుచెదరని బలమైన పద్ధతులే కొనసాగుతున్నాయి.
ఇతిహాసాలు చరిత్ర ఆధారంగా ఆవిర్భవించిన లంబాడి తెగ క్షత్రియ వంశీయులకు, బ్రాహ్మణ స్త్రీలకు జన్మించినట్లు తెలుస్తుంది. అందువల్ల లంబాడి జాతి సహజంగా క్షత్రియ పౌరుషం కలిగి ఉంటారని విశ్వసిస్తారు. లంబాడి వంశాలలో రాథోడ్‌ వంశం, చౌహన్‌ వంశం, పహ్మర్‌ వంశం ప్రసిద్ధి చెందినవి. అయితే లంబాడి సమాజం రెండు ముఖ్య గోత్రాలుగా విభజించబడింది. బంధుత్వాలు కలుపుకోడానికి విభజన జరిపారు. అవి జాట్‌, భూక్య. కానీ రాథోడ్‌ వంశంలో 27 గోత్రాలున్నాయి. వారిని భూక్య గోత్ర సమూహంగా ఒకే గోత్రీకులుగా నిర్ణయించారు. జాత్‌ గోత్ర సమూహంలో 6 గోత్రాలు ఉన్నాయి. బాణావత్‌ జాత్‌ గోత్రం కింద పరిగణిస్తారు.
లంబాడీలు కళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. తేజ్‌ నత్యం, లేంగి నత్యం, కిక్లి నత్యం, కోలాటం, లంబాడి అనగానే నత్యం జ్ఞాపకం వస్తుంది. లంబాడీ నత్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. పలు రకాల రంగులతో అల్లిన దుస్తులు ధరించి ఘల్లు ఘల్లు మనే ఆభరణాలతో వాయిద్యాలకు అనుగుణంగా సంగీతం అందుకొని లయబద్ధంగా కదలికలతో, హావభావాల ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. తీజ్‌ పండగ రోజు… పండగ విశిష్టత గురించి స్త్రీలంతా కలిసి నత్యం చేస్తారు. లేంగీ నత్యం హోలీ సమయంలో లయబద్ధంగా స్త్రీ పురుషులు కలిసి పాడుతూ నత్యం చేస్తారు. కిక్లి నత్యం పిల్లలకు సంబంధించినది. పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ స్త్రీలు నత్యం చేస్తారు. కోలాటంలో దేవతలకు సంబంధించిన పాటలు పాడుతూ రెండు చేతుల్లో చిన్నపాటి కర్రముక్కలతో కోలాటం వేస్తూ నత్యం చేస్తారు. కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు మనిషి పుట్టుక నుండి ప్రారంభమై గిట్టే వరకు జీవితాన్ని పెనవేసుకొని ఉంటాయి. అందుకు లంబాడి సంస్కతి సాంప్రదాయాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
ఆధునిక ప్రపంచంలో మానవ సంబంధాలలో ఎన్నో పరిణామాలు వచ్చాయి. లంబాడీలు కూడా ఈ ప్రభావానికిలోను గాక తప్పలేదు. ప్రాథమిక జీవనం నుండి మైదాన ప్రదేశంలోకి తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. సమాజంలో ఉన్నందున విద్యావంతులయ్యారు. 1977లో భారత ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా షెడ్యూల్‌ తెగలుగా గుర్తించడంతో ప్రభుత్వ చట్టాలు వీరి అభివద్ధికి దోహదపడుతున్నాయి.
భారతీయ పురాతన జాతి కావటం, పాత సాంప్రదాయాలు వదులుకోలేకపోవటం వంటి విశ్వాసాల నుండి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చినప్పటికీ వీరికి ప్రత్యేక సదుపాయాలు కలిగించి లంబాడీలలో సహజంగా ఉన్న తెలివితేటలు, మేధా సంపత్తికి సహాయంగా కొత్త పథకాలు అమలులోకి తెచ్చి దేశాభివద్ధికి లంబాడీలను ఉపయోగించుకోవాల్సిన అవసరం భారత ప్రజలకు, ప్రభుత్వానికి ఉన్నది. లంబాడీ తెగా ఇంకా అభివద్ధిలోకి రావాలని ఆశిద్దాం.
– పూసపాటి వేదాద్రి, 9912197694